కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి...

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి...
  • టీపీటీఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:ఉద్యోగాలు చేస్తూ, సర్వీస్ లో వివిధ రకాలుగా మరియు  కరోనా కాలంలో మరణించిన పలు  శాఖల ఉద్యోగుల వారసులకు వెంటనే కారుణ్య నియామకాలు  చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టకుండా   ప్రభుత్వం మరియు అధికారులు నిర్లక్ష్య వైఖరి  ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల కాళీల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసివుండగా ఖాళీలు లేవని చేతులెత్తెయడం దారుణం అన్నారు.

ముక్యంగా గత  ఏడు సంవత్సరాలుగా మరణించిన ఉపాధ్యాయుల  విషయంలోప్రభుత్వం మరియు అధికారుల తీరు బాధిత కుటుంబాలకు వేదనను గురిచేస్తున్నారు.పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఖాళీలు ఉన్న కాళీలను నింపవద్దని, గ్రూప్ 4 పెడతామని ఓసారి, అసలు ఖాళీలు లేవని ఓసారి చెపుతూ,ఉన్న కాళీలను మొన్న విఆర్వోస్ తో, నిన్న వీఆర్ఏ తో నింపడం జరిగిందనీ అన్నారు.ఇతర శాఖల్లో చూపిస్తున్న చొరవ, ముక్యంగా రెవిన్యూ లో చేపడుతున్న కారుణ్య నియామకాలు విద్యాశాఖ లో అట్టి నిబద్దత లేకపోవడం దారణమని అన్నారు.విద్యాశాఖలో ఉన్న ఖాళీలను, ఇతర శాఖల వారితో నింపుకున్న అధికారులు, ఉపాధ్యాయ కుటుంబాలకు మొండిచేయి చూపెడుతున్నారని  అన్నారు.ఈ మధ్య జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఖాళీలు లేవని రాష్ట్ర వ్యాప్తంగా 1266 ఆఫీస్ సభార్డినేట్ ఖాళీలను అప్గ్రేడ్ చేసిన పోస్టులలో కూడా రెవిన్యూ శాఖ మరియు ఇతర శాఖల వారికి అవకాశం కల్పించడం, విద్యాశాఖ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ సవతితల్లి ప్రేమ అద్దం పడుతుంది అన్నారు.కరోనా మహమ్మారీ తో మరణించిన ఎన్నో ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇట్టి నియమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంనాథ్ రెడ్డి నాయకులు వేణుగోపాల్ రావు, పురుషోత్తం, రవీందర్,వాసుదేవ రావు, తిరుపతి, దేవేందర్, మల్లికార్జున్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.