బడా బాబులా జీరో దందా 

బడా బాబులా జీరో దందా 
  •  ప్రభుత్వ ఆదాయానికి గండి
  • పట్టించుకోనిఉన్నతాధికారులు .
  •  గిరిజన అమాయకులే వారి బినామి. 

ముద్ర ,వెంకటాపురం (నూ):ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో  జీరో దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతుంది.తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు ఇది ప్రధాన వ్యాపారం.అందుకే కొంత మంది బాడా బాబు లు  గిరిజన అమాయకుల అవసరాలనూ ఆసరా చేసుకుని వారిని తమ బినామిలుగాచేసుకుంటున్నారు.ఈ జీరో దందా లో అన్ని వర్గాల  బడా బాబులు ఉన్నారు.ఎంతమంది వినియోగదారులకు దుకాణాదారులు బిల్లులు ఇస్తున్నారు. సరుకులు కొనే ముందు జి.ఎస్.టి పేరుతో వినియోగదారుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేసే దుకాణాదారులు ఎంతమంది సరుకులు కొనేవారికి జి.ఎస్.టి తో కూడిన ఒరిజినల్ బిల్లులు ఇస్తున్నారు. రూ. కోట్లల్లో వ్యాపారం చేసేవారు రూ. వేలల్లో... రూ. లక్షల్లో వ్యాపారం చేసే వారు రూ. వందల్లో మాత్రమే అమ్మకాలు చూపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అటు ప్రభుత్వాన్ని.. ఇటు జనాలను మోసం చేస్తూ వ్యాపారాలు చేసే వారెక్కువయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆస్తులు సంపాదించడం జీరోదందా కూడా ఒకమార్గమనే తెలుస్తోంది.నాణ్యత లేని జీరో అమ్మకాలు సాగిస్తూ..ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా...అడిగే నాథుడు లేక కొంతమంది వ్యాపారస్తుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. కొన్ని సరుకులకు మాత్రమే బిల్లులు చూపిస్తూ తమ జీరోదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషయం లో కొత్త గా వచ్చిన జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతో ఉంది అని మండల ప్రజలు పత్రిక ముఖంగా తెలియజేస్తున్నారు.