కొండగట్టు తలనీలాలకు 12 లక్షల ఆదాయం...

కొండగట్టు తలనీలాలకు 12 లక్షల ఆదాయం...
  • గతంలో రెండు లక్షలకే టెండర్..
  • కమిషనర్ ఆదేశాలతో మరోసారి టెండర్ నిర్వహణ...

 ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో కరోనా కాలంలో అధికారులు సేకరించిన తలనీలాలకు రూపాయలు 12 లక్షల  ఆదాయం సమకూరింది. అప్పుడు సేకరించిన తలనీలాలను అధికారులు శనివారం గుత్తేదారుకు అప్పగించారు. కరోనా సమయంలో ఆలయం తరుపున అధికారులు  దాదాపు 260 కేజీలు సేకరించగా, అందులో 60 కేజీలు పనికిరానిది ఉంది. గత సంవత్సరo జూన్ మాసంలో అధికారులు వీటికి టెండర్ నిర్వహించగా, కేజీ వెయ్యి చొప్పున 200 కేజీలకు రెండు లక్షల రూపాయలకే కాంట్రాక్టర్లు  దక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు.

అప్పుడు ఆలయ అధికారులు కూడా సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.. అయితే ప్రస్తుతం టెండర్ దక్కించుకున్న గుత్తేదారు తాను ఎక్కువ చెల్లిస్తానని దేవాదాయ కమిషనర్ కు అప్లికేషన్ పెట్టడంతో తిరిగి డిసెంబర్ లో మళ్ళీ టెండర్ నిర్వహించగా, కేజీ 6 వేల చొప్పున 200 కేజీలకు 12 లక్షల రూపాయల సమకూరిoది. కర్నూలు జిల్లాకు చెందిన రామాంజనేయులు అనే గుత్తేదారు టెండర్ దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.