భారత అర్జున అవార్డ్ గ్రహీత పారుపల్లి కశ్యప్‌ తండ్రి ఉదయ్‌ శంకర్ శివసేన పార్టీలో చేరిక..

భారత అర్జున అవార్డ్ గ్రహీత పారుపల్లి కశ్యప్‌ తండ్రి ఉదయ్‌ శంకర్ శివసేన పార్టీలో చేరిక..

భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కశ్యప్‌ తండ్రి ఉదయ్‌ శంకర్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ పార్టీలోకి ఆహ్వానించారు.

ఉదయ్‌ శంకర్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ కి స్వయానా మామ.

ప్రజలకు సేవ చేసేందుకు శివసేన పార్టీలో చెరినట్టు తెలిపిన ఉదయ్‌ శంకర్.

రానున్న రోజులలో శివసేన పార్టీ బలమైన శక్తిగా ఏర్పడుతుందన్న సింకారు శివాజి.

త్వరలో భారీగా శివ సేన పార్టీలో చెరికలు ఉంటాయని తెలిపిన సింకారు శివాజీ.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కావాలనే నాశనం చేస్తుందన్న శివాజి..

 హిమాయత్ నగర్ లోని శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కశ్యప్‌ తండ్రి పారుపల్లి ఉదయ్‌ శంకర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ఆధ్వర్యంలో శివసేన పార్టీలో చేరాడు. సింకారు శివాజీ పార్టీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పారుపల్లి ఉదయ్‌ శంకర్ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ కి స్వయానా మామ అవుతాడు. ప్రజా సేవ చేసేందుకు శివసేన పార్టీలో చెరినట్టు తెలిపాడు. త్వరలో ఎంతో మంది శివసేన పార్టీలో చెరనున్నట్టు ఉదయ్‌ శంకర్ తెలిపారు.
దేశం కోసం, ధర్మం కోసం పోరాడే వారు శివసేన పార్టీలో చేరాల్సిన అవసరం ఉందని ఉదయ్‌ శంకర్ అన్నారు.

ఈ సందర్భంగా శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ బలమైన శక్తిగా చెయ్యడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజలు పడుతున్న కష్టాలపై పోరాటం చేస్తామని అన్నారు. రోజురోజుకు రాష్ట్రంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పైన భవనాలు కూలి ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రీకి ఎందుకు విద్యార్థుల గోస కనపడటం లేదని ప్రశ్నించారు. సరైన ఆహారం అందని కారణంగానే విద్యార్థులు ఆసుపత్రి వెళ్తున్నారనీ తెలిపారు.


విద్యా వ్యవస్థ కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తుందనే అబిప్రాయం వ్యక్తమౌతుందనీ అన్నారు. కార్పొరేటు పాఠశాలలో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తుంటే ఎందుకు వాటి పైన చర్యలు తీసుకోవటం లేదని  ప్రశ్నించారు. ప్రవెట్ కళాశాలలో హాస్టెల్స్ పెట్టె హక్కు ఎవరు ఇచ్చారని అన్నారు, ర్యాంకుల పెరు చెప్పి తల్లిదండ్రులను మోసం చేసి విద్యార్థులను జైలు ఖైదీలుగా మార్చిన వాటిని చుసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని అన్నారు.


బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణ పాఠం చెప్పేందుకు శివ సేన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు అన్నారు. రానున్న రోజులలో శివ సేన పార్టీ బలోపేతం చేస్తామని, భారీగా చెరికలు ఉంటాయని అన్నారు.119 స్థానాలలో శివసేన పార్టీ అభ్యర్థులు ఉంటారని స్పష్టం చేసారు. పారుపల్లి ఉదయ్‌ శంకర్ తో పాటు నెక్సస్ డ్రగ్స్ ప్రవెట్ లిమిటెడ్ ఫార్మ కంపెనీ కి చెందిన టెక్నికల్ డైరెక్టర్‌ రాజరావూ కూడా శివ సేన పార్టీలో చేరారు. త్వరలో వందల సంఖ్యలో వివిద విభాగాలకు చెందిన వారు పార్టీలో చెరనున్నట్టు అన్నారు. యువసేన రాష్ట్ర నాయకులు జంపుల సాయి, ముని కుమార్, మారుతి విష్ణు, రాహుల్ తదితరులు ఉన్నారు.