ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్ గా తెలంగాణ మహిళ

ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్ గా తెలంగాణ మహిళ

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్ గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి (శాండిరెడ్డి) ఎన్నికయ్యారు. ఈ పదవిని అందుకున్న తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె ఘనతికెక్కారు. ఈనెల 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్  మేయర్ గా ఎన్నికయ్యారని, కౌన్సిలర్ గా గెలిచిన సంధ్యారెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారని స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించింది.