ఆత్మహత్య చేసుకుంటున్నా : హోంగార్డు రాంబాబు

ఆత్మహత్య చేసుకుంటున్నా : హోంగార్డు రాంబాబు

కల్లూరు, ముద్ర: హోం గార్డ్ రవీందర్ ఆత్మహత్య నేపథ్యంలో కలత చెందిన ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ హోంగార్డు రాంబాబు ఆత్మహత్య చేసుకుంటానని హోంగార్డ్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. హోంగార్డుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన తోటి హోంగార్డు లు విషయాన్ని పోలీసు ఉన్నతాధికారి ద్వారా రాంబాబుతో సంప్రదింపులు చేపట్టారు.  అతని కి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.