30న నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన.....

30న నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన.....
  • ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య వెల్లడి.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పాత మున్సిపల్ కార్యాలయం స్థలంలో సెప్టెంబర్ 30న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య చెప్పారు. గురువారం స్థల పరిశీలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల అవసరాల రీత్యా నూతన భవన నిర్మాణం చేపట్టి మెరుగైన పాలన అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ ఇంచార్జి సర్పంచ్ దాసి సంతోష్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్, బిఆర్ఎస్  పట్టణ ప్రదాన కార్యదర్శి దయ్యాల సంపత్, నాయకులు జూకంటి వెంకటేష్, సరాం సంతోష్ కుమార్, కుతాటి అంజన్ కుమార్, ఒకటవ వార్డు అధ్యక్షులు కటకం మల్లేష్, 12వ వార్డు అధ్యక్షులు ఆలేతి బాలకిషన్, సీసా ప్రవీణ్, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ బాసాని ప్రశాంత్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.