ప్రజా ప్రతినిధివా? కాంట్రాక్టర్ కి పిఆర్ఓవా?

ప్రజా ప్రతినిధివా? కాంట్రాక్టర్ కి పిఆర్ఓవా?
  • కృష్ణ నీళ్ల వాటా తేల్చకుండా గాడిదలు కాస్తుండ్రా
  • ప్రెస్ మీట్  బట్టి విక్రమార్క వట్టెం ప్రాజెక్ట్ బిజినేపల్లి మండలం
  • ప్రజా ప్రతినిధివా? కాంట్రాక్టర్ కి పిఆర్ఓవా?  మరి జనార్దన్ రెడ్డి పై భట్టి ఫైర్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రతినిధివా? కాంట్రాక్టర్ కోసం పనిచేసే పి ఆర్ ఓనా? వారికి టెక్నికల్ అసిస్టెంట్ వా? లేక సలహాదారుడివా? వట్టెం ప్రాజెక్టు నిర్మాణానికి చుట్టు పక్కల చెరువుల నుంచి నల్ల మట్టి తరలించుకోపోవడానికి కాంట్రాక్టర్కు లబ్ధి చేయడానికి ఎమ్మెల్యేగా గెలిచావా? అని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై భట్టి ఫైర్ అయ్యారు. వట్టెం ప్రాజెక్టు నిర్మాణానికి నల్ల మట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలని టెండర్ లీడ్ ఉన్నది ఏంటి? ఎక్కడి నుంచి తీసుకువచ్చి బండు నిర్మాణం చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల చెరువుల్లో జరిగిన మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ చేయాలన్నారు.

 చెరువుల్లో ఐదు నుంచి పది అడుగుల లోతు వరకు నల్ల మట్టి  కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చిన ఎమ్మెల్యే చెరువులు ఇంకిపోయి ఆయకట్టు ఎండిపోతే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల మట్టి కుంభకోణానికి పాల్పడుతున్న మర్రీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలతో మట్టి జనార్దన్ రెడ్డి గా పిలిపించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ల్యాండు, స్యాండు, మైన్స్, వైన్స్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు బొందల గడ్డను సైతం వదలడం లేదని విమర్శించారు. రెండుసార్లు గెలిచి నాగర్ కర్నూల్ అభివృద్ధికి ఏం చేశాడని ప్రశ్నించారు. చెన్నై షాపింగ్ మాల్స్ బ్రాంచులు విస్తరించడం పట్ల ఉన్న శ్రద్ధ  మర్రి జనార్దన్ రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధిపై లేదని విమర్శించారు.

బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ జరిపించి దోపిడీకి పాల్పడిన ప్రజా సంపదను కక్కిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న అధికారుల లెక్కలు కూడా రాస్తున్నామని చట్టబద్ధంగా వారిపై కూడా చర్యలు ఉంటాయని.  తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు ఏంటి? ఇప్పటివరకు మనం సాధించినవి ఏంటి? సాధించకపోవడానికి అడ్డంకిగా ఉన్న కారణాలను చర్చించుకుని అడ్డుగా ఉన్న వారిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భయంగా బతికే రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఐదు నెలల్లో తెలంగాణ సమాజాన్ని విముక్తి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో నడుస్తున్న పోలీసు రాజ్యాన్ని పారద్రోలి సామాజిక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తుందని వెల్లడించారు.