చిరునవ్వుతో రోగాలను జయించండి: జిల్లా జడ్జి డి రాజేష్ బాబు

చిరునవ్వుతో రోగాలను జయించండి: జిల్లా జడ్జి డి రాజేష్ బాబు
Conquer diseases with a smile District Judge D Rajesh Babu

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: రోగులకు చిరునవ్వే జీవితంలో వెలుగు నింపుతుందని నాగర్ కర్నూల్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి డి రాజేష్ బాబు అన్నారు. ప్రపంచ కేన్సర్‌ సర్వైవర్స్‌ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు.వారికి  ధైర్యం చెప్పారు.జిల్లా జడ్జి రోగులతో మాట్లాడుతూ ఆపరేషన్‌ చేయించుకోని ధైర్యంగా ఉండాలన్నారు.ఆస్పత్రిలో మంచి వైద్యులు ఉన్నారని, రోగులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా డాక్టర్లకు సమాచారం ఇచ్చి తగిన సహాయం పొందాలన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని, ఆపరేషన్లు చేయించుకున్న వారిని పరామర్శించి వారి అభిప్రాయాలను సేకరించారు. కేన్సర్‌ వ్యాధి అంటే భయపడాల్సిన పనిలేదని, నేడు అనేక మందులు వచ్చాయని ఆయన సూచించారు. కేన్సర్‌ వ్యాధి రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అనంతరం పాలెం డిఎంహెచ్వో కార్యాలయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ప్రతిసంవత్సరం కేన్సర్‌ సర్వైవర్స్‌డే సందర్భంగా అధికారులు వివిధద మండలాలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు    తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లాలో క్యాన్సర్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పొగాకు వాడకుండా దూరంగా ఉండాలన్నారు.పండ్లు తాజా కూరగాయలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.జిల్లాలో 12,749 మందికి పరీక్షలు నిర్వహించగా 459 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో 459 మంది క్యాన్సర్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా 325 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బారాసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా,అదనపు పీపీ భవాని భాయ్, వైద్యులు రాజేష్ కుమార్, రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, కోర్టు సిబ్బంది కేశవరెడ్డి, వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.