ఎస్బిఐ ఖాతాదారుల నుంచి 20 లక్షల వరకు స్వాహా చేసిన బ్యాంకు క్యాషియర్

ఎస్బిఐ ఖాతాదారుల నుంచి 20 లక్షల వరకు స్వాహా చేసిన బ్యాంకు క్యాషియర్
  • బ్యాంకు క్యాషియర్ పై అనుమానం !?
  • విచారణ చేస్తున్నామన్నబ్యాంకు మేనేజర్

ముద్ర, అచ్చంపేట:నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బిఐ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నాగర్ కర్నూల్ ప్రధాన రహదారి పై ఉన్న బ్యాంకులో ఇద్దరు ఖాతాదారుల నుండి 20 లక్షల వరకు స్వాహా చేసిన బ్యాంకు సిబ్బంది బాగోతం ఇది. ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన పిల్లిగుండ్ల వినోద్ ఎస్బిఐ బ్యాంకులో 14 లక్షల 30 వేల వరకు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన అనిత తన భర్త వ్యవసాయం చేస్తూ మృతి చెందగా ఆయనకు రైతు బీమా నుండి వచ్చిన ఐదు లక్షలను బ్యాంకు ఖాతాలో ఉంచగా నాలుగు లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని అనిత బ్యాంక్ క్యాషియర్ కోరగా ఆమె ఖాతా నుండి నాలుగు లక్షల విత్ డ్రా చేసి ఆమెకు బాండ్ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చి బాండు విషయమై బ్యాంకులో విచారణ చేపట్టగా ఇది డిపాజిట్ బాండ్ కాదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో మోసపోయానని గ్రహించి బ్యాంకు మేజర్ కు తనకు జరిగిన విషయాన్ని తెలిపారు.

అదేవిధంగా పిల్లిగుండ్ల వినోద్ ఖాతా నుండి 50,000 మిగిల్చి మిగతా 13 లక్షల 80 వేల రూపాయలను బ్యాంకు నుండి విత్ డ్రా  చేశారని డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన వినోద్ కు డబ్బులు లేవని తెలవడంతో బ్యాంకు మేనేజర్ కు జరిగిన విషయం తెలిపారు. బ్యాంకు సిబ్బంది తమ డబ్బులను కొల్లగొట్టారని బాధితులు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ వివరణ ఇస్తూ డబ్బు డ్రా జరిగిన విషయం తప్పు జరిగిన విషయంపై శాఖ పరంగా విచారణ చేపడుతున్నామని అక్రమాలకు పాల్పడిన బ్యాంకు సిబ్బంది ఎవరైనా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ఇంట్లో డబ్బు పెట్టుకుంటే భద్రంగా ఉండదని బ్యాంకులో నైతే భద్రంగా ఉంటుందని భావించి డబ్బును దాచుకున్న ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది ఈ రకంగా డబ్బులను అక్రమంగా దోచుకోవడం ఏమిటని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులను అక్రమంగా దొంగిలించిన సదరు క్యాషియర్ విధులకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఖాతాదారుల కు తమ నగదు నిలువలపై డిపాజిట్ లపై గందరగోళం నెలకొని ఉందని ఖాతాదారుల డబ్బుకు భరోసా భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్బిఐ ఖాతాదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.