పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని కేతేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 పదవ తరగతి విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్వపు విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. సుమారుగా 20 సంవత్సరాల క్రితం చదువుకున్న పాఠశాలలో మరోసారి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. విద్యార్థులు పరిచయ కార్యక్రమంతో పాటు ప్రస్తుతం వారు నిర్వర్తిస్తున్న విధుల గురించి తోటీ స్నేహితులతో కలిసి చర్చించుకున్నారు. పాఠశాలలో అనాడు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులకు పూలమాలవేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం ఇద్దరు మహిళా స్నేహితులు పేదరికంతో జీవనం కొనసాగించడం పట్ల తోటి స్నేహితులు అందరూ కలిసి ఒక్కక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,కృష్ణయ్య, నరసింహయ్య, ధర్మారెడ్డి, జ్యోతి,నరసింహ,స్వరాజ్యం,చంద్ర కాంత్, నిర్వాహకులు రాంబాబు,నరేందర్,,వీర శేకర్,యాదగిరి,సంఘనమోని లక్ష్మణ్, కె.నరేందర్,వేణుగోపాల్,రాజబాబు,కురుమయ్య,ప్రశాంతి,చిన్నమ్మ,సాయి కృష్ణ,రామేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.