ఎన్టీఆర్ ట్రస్టుతో ఎన్నో సేవా కార్యక్రమాలు: భువనేశ్వరి

ఎన్టీఆర్ ట్రస్టుతో ఎన్నో సేవా కార్యక్రమాలు:  భువనేశ్వరి

ఎన్టీఆర్ నిబద్ధతకు నిదర్శనమని ఆయన కూతురు నారా భువనేశ్వరి తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు.

ఎన్టీఆర్ సిద్ధాంతాలను ట్రస్ట్ పాటిస్తోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దాతలు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు మరొకరి జీవితంలో సంతోషాన్ని నింపుతుందన్నారు.