నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి: బిఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి

నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి: బిఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి

శ్రీరంగాపూర్ / ముద్ర : వనపర్తి నియోజకవర్గానికి తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మరొకసారి తనను ఆశీర్వదించి అసెంబ్లీ ఎన్నికలు గెలిపించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీరంగాపూర్ మండల ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ యంత్రాంగం ఉండాలని వనపర్తిని జిల్లా కేంద్రంగా చేయటమే కాకుండా, శ్రీరంగాపురం ను సైతం మండల కేంద్రంగా తీర్చిదిద్ది, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా ప్రతి గ్రామానికి బీటీ రోడ్లను, తండాలను గ్రామపంచాయతీలుగా, ప్రతి గ్రామానికి సాగునీరు, తాగునీరు, అందించడమే కాకుండా మిషన్ కాకతీయ, రుణమాఫీ, రైతుబంధు, దళిత బంధు, చేతివృత్తుల పనివారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలతో సంక్షేమ అభివృద్ధి బాటలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇలాంటి అభివృద్ధి చేస్తున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని మంత్రి మండల ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి పృథ్వీరాజ్, సర్పంచులు సత్యం యాదవ్, మంజుల, నిర్మల, వినీల రాణి, ఆంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి, జలీల్, తదితరులు పాల్గొన్నారు.