కొల్లాపూర్ ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

కొల్లాపూర్ ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

ముద్ర, వీపనగండ్ల:-వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బిజ్జ నరేష్ కుమార్,హమాలీ సంఘం అధ్యక్షుడు బిజ్జ బాలచంద్రయ్య లు  బుధవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.అభివృద్ధి చేసే బీరం హర్షవర్ధన్ రెడ్డి కే మా మద్దతు అని,వారి అడుగు జాడల్లో కొల్లాపూర్ అభివృద్ధి కోసం పని చేస్తామని పార్టీలో చేరిన వారు అన్నారు.ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేసిన అభివృద్ధి కండ్ల ముందే ఉందని,,అభివృద్ధికి పట్టం కట్టాలని ,మరొక్కసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ  సీనియర్ నాయకులు ఎద్దుల సురేందర్ రెడ్డి ,  రైతుబంధు అధ్యక్షుడు కోదండ యాదవ్ ,తిరుపతయ్య,కళామూరి గాలెన్న ,వార్డ్ మెంబర్ ఎమ్ నరేష్ యాదవ్ ,జుర్రు బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.