మంత్రి నిరంజన్ రెడ్డికి మళ్ళీ భారీ షాక్

మంత్రి నిరంజన్ రెడ్డికి మళ్ళీ భారీ షాక్

 టిఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీటీసీలు రాజీనామా
 ముద్ర ప్రతినిధి, వనపర్తి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న వనపర్తి నియోజకవర్గంలో ఒక్కొక్కరు పార్టీకి దూరమవుతున్నారు. ఇటీవలే జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి తోపాటు ఎంపీపీలు కిచ్చారెడ్డి, మేఘారెడ్డిలతో పాటు అనేకమంది ఎంపీటీసీలు సర్పంచులు రాజీనామాలు చేశారు.

జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకోగా అదే రోజు వనపర్తి మండలంలోని ఇద్దరు ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేశారు. వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి నేతృత్వంలో వనపర్తి మండలం చందాపూర్ ఎంపీటీసీ చెన్నమ్మ మెంటపల్లి ఎంపీటీసీ శశిరేఖలు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బిఆర్ఎస్కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.