బ్రతికున్న రైతులను రుణమాఫీ లిస్టులో చనిపోయినట్లు చూపిన వ్యవసాయ అధికారులు - రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి

బ్రతికున్న రైతులను రుణమాఫీ లిస్టులో చనిపోయినట్లు చూపిన వ్యవసాయ అధికారులు - రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి

ముద్ర.వీపనగండ్ల: పంట రుణాలు మాఫీ కానీ రైతులకు వెంటనే మాఫీ చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వీపనగండ్ల వ్యవసాయ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదం వల్ల  ముగ్గురు రైతులు చనిపోయినట్లు  పంట రుణ మాఫీ లిస్టులో ఉండటంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతులు చనిపోక ముందే రుణమాఫీ లిస్టులో అధికారుల తప్పిదాల వల్ల ముగ్గురు రైతులు చనిపోయినట్లుగా లిస్టులో ఉండడంతో రుణమాఫీ కాకపోవటంతో ఆ రైతులు మనస్థాపాన్ని గురవుతున్నారని వ్యవసాయ శాఖ ముందు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రం అందించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంపించిన రుణమాఫీ లిస్టులో తప్పిదమువల్ల వీపనగండ్ల గ్రామానికి చెందిన బత్తుల రాముడు, గోపాల్ దీన్నే గ్రామానికి చెందిన  కురువ నరసింహ, తూముకుంట గ్రామానికి చెందిన కొండ కృష్ణారెడ్డి లు బ్రతికే ఉన్నారని, వ్యవసాయ అధికారులు మాత్రం రైతుల పేర్లు రుణమాఫీ లిస్టులో చనిపోయినట్లుగా పంపడం ద్వారా వారికి రుణమాఫీ వర్తింప చేయకపోవడంతో ఆందోళన గురవుతున్నారని అన్నారు. అధికారులు చేసిన  తప్పిదాలను వెంటనే సరిచేసి రైతులకు  రుణమాఫీ డబ్బులను వెంటనే వేయాలని  డిమాండ్ చేశారు.ఈ తప్పిదాలు కారణమైన అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,.ఎన్నికల కోడ్ వల్ల చాలామంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని, ఎన్నికల కమిషన్ రైతుల మీద దయవుంచి రుణమాఫీ డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, ఆశన్న, బత్తుల రాముడు, రామన్ గౌడ్,నరసింహ, నవీన్,గుమ్మడం సత్తి,ఈశ్వరయ్య,శివరాజు తదితరులు పాల్గొన్నారు.