ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ముద్ర.వీపనగండ్ల:- విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పి స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మండల పరిధిలోని కాల్వరాల ప్రాథమిక పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. మండల విద్యాధికారిగా ఐదో తరగతి చదువుతున్న రాధిక, ప్రధానోపాధ్యాయులుగా ఐదవ తరగతి చదువుతున్న కార్తీక్ వ్యవహరించారు. మరో 14 మంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుల వ్యవహరించి పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్తమ బోధన అందించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, వరలక్ష్మి, శిరీష ఉన్నారు.