పోచంపల్లి ఎస్ఐ గా భాస్కర్ రెడ్డి భాద్యతలు స్వీకరణ
భూదాన్ పోచంపల్లి,ముద్ర: భూదాన్ పోచంపల్లి నూతన ఎస్ఐగా కే. భాస్కర్ రెడ్డి శనివారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.గతంలో నల్లగొండ రూరల్ ఎస్ ఐ గా పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు.ఇక్కడ ఎస్ ఐ గా పని చేసిన విక్రమ్ రెడ్డీ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ కు, ఎస్సై-2 గా పనిచేసిన సురేష్ కుమార్ పోచారం ఐటీ కార్డర్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.