అంధత్వ నివారణే ప్రభుత్వ లక్ష్యం ‐ జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్

అంధత్వ నివారణే ప్రభుత్వ లక్ష్యం ‐ జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్

ముద్ర ప్రతినిధి, వనపర్తి :  అందత్వ నివారణే లక్ష్యంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా చేపట్టారని జడ్పీ వైస్ చైర్మన్  వామన్ గౌడ్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని ముమ్మళ్లపల్లె గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని   జడ్పీ వైస్ చైర్మన్  వామన్ గౌడ్, ఆ గ్రామ సర్పంచ్ కురుమయ్యతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్య ఉన్నవారికి రాష్ట్రప్రభుత్వం ఉచితంగా కళ్లఅద్దాలను పంపిణీ చేస్తుందన్నారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమా నికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు.  అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కళ్ళఅద్దాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు కొండారెడ్డి,  గాడిలా ప్రశాంత్, జగన్మోహన్ రెడ్డి,  కటికే శ్రీనివాస్,  జి రాజ్ కుమార్,  చింటూ,  ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.