ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
MLA Beeram Harshavardhan Reddy

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం  కృషి చేస్తుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో మన ఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా 29 లక్షల 96 వేల రూపాయలతో చేపట్టిన పాఠశాల, కిచెన్ షెడ్స్, మరుగుదొడ్లు, అదనపు గదులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ర్టంలో సమూల మార్పులు వచ్చాయని,  అందులో భాగంగానే మన ఊరు - మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని అన్నారు.

విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని,  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సింగోటం– గోపాల్ దీన్నే లింకు కెనాల్ నిర్మాణం కోసం రైతులు సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో మండల  విద్యాధికారి లక్ష్మణనాయక్, జడ్పిటిసి మాధురి కిరణ్ గౌడ్, ఎంపీడీఓ కతలప్ప, స్థానిక సర్పంచ్ మౌలాలి, విద్యా కమిటీ చైర్మన్ గోపాల్, గ్రామాల సర్పంచులు, మండల భరాస పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, వీపనగండ్ల  భాస్కర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు వేణు మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.