కొప్పునూరు సింగల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక

కొప్పునూరు సింగల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక

ముద్ర.వీపనగండ్ల:-చిన్నంబావి మండలం బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కొప్పునూరు సింగల్ విండో చైర్మన్, బగ్గారి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీమంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు బగ్గారి నరసింహారెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర యాదవ్, పార్టీ నాయకులు పగిడాల శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రావు, నాయకులు కళ్యాణ్ రావు తదితరులు ఉన్నారు.వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మెగారెడ్డి  కొప్పునూరు సింగల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి బావ బామ్మర్దులు కావడం విశేషం.