మాట తప్పును .. మడమ తిప్పను

మాట తప్పును .. మడమ తిప్పను
  • కాంగ్రెస్ పార్టీకి నా అవసరం ఉన్నంత వరకు పని చేస్తాను..
  • చిన్నారెడ్డి ప్రజాభీష్టానికి కట్టుబడి పోటీ నుండి తప్పుకోవాలి.
  • అవినీతి పరుడుని ఓడించడానికే కంకణం కట్టుకున్న వ్యక్తిని..
  • అన్ని సర్వేలో తనకు అనుకూలంగా వచ్చినా చివరి నిమిషంలో నా అభ్యర్థిత్వాన్ని మార్చేశారు.
  • ఉద్వేగంగా ప్రసంగించిన కాంగ్రెస్ నేత మేఘారెడ్డి..

ముద్ర, వనపర్తి :  వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట కోసం మాట తప్పును.. మడమ తిప్పను అని కాంగ్రెస్ నేత మేఘారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో విడత లో వనపర్తి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించిన మేఘారెడ్డి , చివరి సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డి కి టిక్కెట్ కేటాయించడంతో  మేఘారెడ్డి వర్గం భగ్గుమ్మన్నది.   ఆదివారం మేఘారెడ్డి తన అనుచరులతో తదుపరి కార్యాచరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి వేలాదిమంది అనుచరులు, కార్యకర్తలు తరలివచ్చారు. తన క్యాంపు కార్యాలయం నుండి భారీ సంఖ్యలో తన మద్దతుదారులతో ర్యాలీగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..  అవినీతిపరుడుతో విభేదించి బయటకు వచ్చిన తనను  చిన్నారెడ్డి , రేవంత్ రెడ్డి కాంగ్రెస్  పార్టీలో కి ఆహ్వానించారని ఆయన్నానరు. ప్రజాభీష్టం మేరకు సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని  ఆనాడు హామీ ఇచ్చి, నేడు సర్వేలన్ని తనకు అనుకూలంగా ఉన్నా, హైకమాండ్ టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం ఇచ్చి చివరి నిమిషంలో చిన్నారెడ్డి పేరు ను ప్రకటించడం ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మాజీ మంత్రి చిన్నారెడ్డి పెద్దమనసు తో టికెట్ తనకు ఇవ్వాలని, కలిసికట్టుగా అవినీతి మంత్రి ని ఇంటికి సాగనంపేలా కృషిచేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీకి తన అవసరం ఉంటే ప్రాణము ఉన్నంతవరకు పని చేస్తానని ఆయన తెలిపారు.  చివరి వరకు టిక్కెట్  నాకు ఇస్తారని నమ్మకం ఉందని, అప్పటి వరకు పోరాడుతానని ఆయన అన్నారు.  నామినేషన్ వేసిన నాడు నా ఆస్తులను ప్రకటిస్తానని, అవినీతికి పాల్పడితే చౌరస్తాలో ఉరి తీయండని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. చివరి వరకు టికెట్ కేటాయించని యెడల తన కార్యకర్తల నిర్ణయమేరకు  తదుపరి కార్యచరణ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చా రెడ్డి , మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్,  మాజీ కౌన్సిలర్ బ్రహ్మం,  వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు వాల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి కిరణ్, కాంగ్రెస్ నాయకులు  టి రవీందర్ రెడ్డి, సత్య శీలారెడ్డి, సాయి చరణ్ రెడ్డి,  మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధనలక్ష్మి , తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.