సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాద్యం

సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాద్యం
  • వేసవిలో త్రాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి 
  • సర్వ సభ్య సమావేశంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి

ముద్ర,పానుగల్:-ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాద్యం అవుతుందని ఎంపీపీ మామిల్లపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.బుధవారం పానుగల్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశంను నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.ముందుగా తాగునీటి సమస్య వున్న గ్రామాల వివరాలు సేకరించి త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ జింక్ ఫర్టిలైజర్ ను రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతు భందు డబ్బులు ఇప్పటికీ ఎంత మంది రైతులకు ఖాతాలలో పడ్డాయని వ్యవసాయ అధికారి ని అడుగగా ఈ నెల చివరి నాటికి రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతు భంధు డబ్బులు అందుతాయన్నారు.జింక్ ను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు.మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పాఠశాలల అభివృద్ధికి సర్పంచులు పూర్తి సహకారం అందించారని వారికి ప్రత్యేక అభినందులను మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారు.KLI,భీమా కాలువల ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించాలని రైతులు వేసిన పంటలను ఎండనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉందనీ ఎంపీటీసీ సుబ్బయ్య యాదవ్ అన్నారు.సర్పంచుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని,గ్రామాలలో సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేలా,నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణాలకు బిల్లులు చెల్లించేలా తీర్మానం చేయాలని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు బాల్య నాయక్,ప్రధాన కార్యదర్శి వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో సర్పంచులు ఎంపీపీ కి వినతి పత్రాన్ని సమర్పించారు.వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరు గురించి వివరించారు.

  • సర్పంచులకు ఘన సన్మానం

ఈ నెల చివరి నాటికి సర్పంచుల పదవి కాలం ముగుస్తుందటంతో సర్పంచులకు ఎంపీపీ, జెడ్ పీటీసీ,వైస్ ఎంపీపీ,ఎంపీటీసీలు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అహర్నిశలు కృషి చేశారని అన్నారు.అధికారులకు సర్పంచులు సహకరించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్, జెడ్పీటీసీ లక్ష్మి చంద్ర శేకర్ నాయక్,వైస్ ఎంపీపీ కవిత దశరథ్ నాయుడు, ఇంచార్జి ఎంపిడిఓ రఘురామయ్య,వివిధ శాఖల అధికారులు,ఎంపీటీసీలు,సర్పంచులు,పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.