పోలింగ్ సరళిని పరిశీలించిన శిరీష అలియాస్ బర్రెలక్క

పోలింగ్ సరళిని పరిశీలించిన శిరీష అలియాస్ బర్రెలక్క

ముద్ర.వీపనగండ్ల:-కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శిరీష అలియాస్ బర్రెలక్క పోలింగ్ కేంద్రాలను ను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించింది. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబాయి మండలాల్లోని పలు గ్రామాలలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళి అధికారులతో అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయటానికి వేచి ఉన్న ఓటర్లను, పోలింగ్ సిబ్బందిని, ఆరోగ్య సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. బర్రెలక్క పోలింగ్ కేంద్రాల పరిశీలనకు రావడంతో మహిళలు ఆసక్తిగా ఆమెను చూశారు.