ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందటం హర్షించదగ్గ విషయమని, ఎంతోమంది వీరుల త్యాగదనుల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఎంపీపీ కమలేశ్వరరావు అన్నారు, వీపనగండ్ల  మండలంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను రైతు వేదికలను గ్రామపంచాయతీలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

ఈ సందర్భంగా కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేసి తెలంగాణ సంబరాలను ప్రారంభించారు, ఉత్సవాల్లో భాగంగా ఈనెల 21 వరకు అన్ని రంగాల్లో అభివృద్ధిపై రోజుకో కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీపీ కమలేశ్వరరావు తాసిల్దార్ పాండు నాయక్ ఎంపీడీవో కథలప్పా తెలిపారు, రైతు సంబరాల్లో భాగంగా మూడున ఆయా గ్రామాల్లోని రైతు వేదికలో రైతు సంక్షేమంపై సంబరాలు నిర్వహించడం జరుగుతుందని రైతులు ఎద్దుల బండ్లను ట్రాక్టర్లు ను అందంగా అలంకరించి ర్యాలీగా రైతు వేదికల వద్దకు చేరుకొవాలని సంబరాల అనంతరం సహపంక్తి భోజనాలు ఉంటాయని అన్నారు.

జాతీయ జెండాలు ఆవిష్కరణ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  తాసిల్దార్ పాండు నాయక్, ఎంపీపీ కమలేశ్వరరావు, ఎస్సై రామన్ గౌడ్, వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, సర్పంచ్ నరసింహారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ రామిరెడ్డి, తూముకుంట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ రామన్ గౌడ్ వారి వారి కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగరవేశారు.