పెబ్బేర్ లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణనికి వినతి
- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ముద్ర. వనపర్తి:- పెబ్బేరు మున్సిపాలిటీలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను కలిసి పెబ్బేరు మున్సిపాలిటీ పట్టణంలో గల ఆరు పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడు చేయాలని కోరారు.
జాతీయ రహదారినీ ఆనుకుని ఉన్న పెబ్బేరు పట్టణంలోని ఆసుపత్రికి అత్యవసర సేవల అవసరం ఎక్కువగా ఉంటుందని దాంతోపాటుపెబ్బేరు పట్టణంలోని 25 వేల జనాభా,పెబ్బేరు మండలంలోని 25 నుంచి 30 వేల జనాభాకు ఈ ఆరోగ్య కేంద్రం నుంచే వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని, పెరుగుతున్న జనాభాను జాతీయ రహదారిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించాలని ఎమ్మెల్యే మంత్రి ని కోరారు.ఎమ్మెల్యే అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించిన మంత్రి వీలైనంత త్వరగా ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.