నూతన యువ ఓటర్లు ప్రజాస్వామ్యానికి పునాది

నూతన యువ ఓటర్లు ప్రజాస్వామ్యానికి పునాది

కొత్త ఓటర్లు తొలి ఓటు అనుభూతి పొందాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: నూతన యువ ఓటర్లు ప్రజాస్వామ్యానికి పునాది. కొత్త ఓటర్లు తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా పిలుపునిచ్చారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్వీప్ అధ్వర్యంలో నిర్వహించిన  యువ ఓటర్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  తల్లితండ్రులతో ఓటు వేయిస్తామని హామీ పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్ విద్యార్థులకు తగు సూచనలు సలహాలను అందించారు. భారత్ ప్రజాస్వామ్య దేశం, ప్రపంచ అన్ని దేశాలకంటే భారత దేశంలో ఎక్కువ యువత ఉందని, నూతన యువ ఓటర్ దేశానికి, ప్రజాస్వామ్యానికి పునాది వంటి వారన్నారు.

ఓటును నిర్లక్షం చేయరాదని, యువత చైతన్యం కావాలని, రాజకీయ నిర్ణయాధికారం యువతదే అన్నారు. ఓటు అమ్ముకోవడం నేరం, నూతన ఓటరు ఓటు వేసి  ప్రజాస్వామ్యన్ని దేశాన్ని గెలిపించాలన్నారు.
కొత్త ఓటరు దేశానికి పునాది లాంటి వారని, 80 సంవత్సరాల వయస్సు  నిండిన వారికి, పిడబ్ల్యూడి ఓటర్లకు, ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు కల్పించిందని,యువత వారి తల్లి తండ్రులకు ఓటు గురించి వివరించాలన్నారు. కుల, మత వర్గ, వర్ణ, ప్రాంత, భాష లాంటి తారతమ్య భేదాలు లేకుండా ఓటు వేయాలని తెలిపారు. డబ్బు, మద్యం, ఏదైనా వస్తువుల పంపిణీ జరిగితే, ఏదైనా ఫిర్యాదులుంటే సి విజిల్ ఆప్ లో ఫిర్యాదు చేయవచ్చని,వివరాలు గోప్యంగా ఉంటాయతెలిపారు  కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్ 1950 ఫోన్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే నామినేషాన్ వేసిన అభ్యర్ధి యొక్క పూర్తి సమాచారం కెవైసి ఆప్ లో లభ్యం అవుతుందన్నారు. ఈ ఆప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోటో తో ఉన్న ఓటరు కార్డ్,  మరో 13 రకాల గుర్తింపు కార్డ్ లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ స్టేషన్ కి తీసుకొని రావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు బ్రహ్మజీ, రాజిరెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్,   విద్యార్థులు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.