మెదక్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశం బాధ్యతలు

మెదక్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశం బాధ్యతలు

42 రోజులకే పాత ఇన్స్పెక్టర్ బదిలీ
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఇన్స్పెక్టర్ గా బి. వెంకటేశం శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాదు నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన  సంజయ్ సిద్దిపేటకు బదిలీ అయ్యారు. ఖదీర్ ఖాన్ మరణం విషయంలో అప్పటి టౌన్ ఇన్స్పెక్టర్ మదు సస్పెండ్ కావడంతో  సంజయ్ గత మర్చి 31న మెదక్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వచ్చారు. కొద్ది రోజులకే సంజయ్ బదిలీ కావడం గమనార్హం.