ప్రజారంజక పాలన కెసిఆర్ కే సాధ్యం

ప్రజారంజక పాలన కెసిఆర్ కే సాధ్యం
  •  జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్

వనపర్తి, ముద్ర : రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ ఆదివారం ప్రకటించిన భారసా మేనిఫెస్టో పేద మధ్య తరగతి అన్ని వర్గాల ప్రజలకు అనుగుణగా ఉందని, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్ అని  వనపర్తి జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు.

1. కెసిఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా కార్యక్రమం వందకు వందశాతం ప్రీమియం చెల్లించి రైతు బీమా తరహాలో కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా (తెల్ల రేషన్ కార్డు హోల్డ్స్ అందరికి) 5 లక్షల రూపాయలు రైతు బీమా తరహాలో అందరికీ వస్తుంది. జూన్ తర్వాత అందుబాటులోకి వస్తుంది.
2. అన్నపూర్ణ పథకం 
ప్రతి  రేషన్ కార్డు హోల్డర్ కు సన్నబియ్యం.
3. ఆసరా పెన్షన్ 5000 రూపాయలు.
4.దివ్యాంగులకు పెన్షన్ 4016 నుండి మొదటి సంవత్సరం 5016లకు తర్వాత ప్రతి సంవత్సరం 300 పెంచుతూ 6016  వరకు పెంపు.
5. రైతు బంధు పథకం
(మొదటి సంవత్సరం 12000 తర్వాత సంవత్సరం 14000 అలా పెంచుకుంటూ 16,000 వరకు తీసుకొని పోతారు)
16 వేల రూపాయలు ప్రతి సంవత్సరం .
6. సౌభాగ్య లక్ష్మి
అర్హులైన పేద మహిళలకు 3000 రూపాయలు.
7. అర్హులైన పేద పేదవారికి గ్యాస్ సిలిండర్లు 400 రూపాయలకు అందజేస్తాం దీనిలో  విలేకరులకు కూడా రిపోర్టర్లకు గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం.
8. ఆరోగ్యశ్రీ యొక్క  గరిష్ట ఇన్సూరెన్స్ 15 లక్షల రూపాయలు వరకు పెంపు.
దీనిలో జర్నలిస్టులకు విలేకరులకు మీ యొక్క యాజమాన్యాలతో మాట్లాడి మీరు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మిగిలిన గవర్నమెంట్ వేసి ఉద్యోగులకు ఇచ్చే విధంగా కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సదుపాయం.
9. అగ్రవర్ణ పేదలకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి అన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించి వనపర్తి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని బిఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ కోరారు.