తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాలి

తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాలి

ముద్ర/వీపనగండ్ల:-1 జనవరి 2024 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్ గా నమోదు చేసుకోవాలని,బిఎల్ఓ లు తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాలని వీపనగండ్ల నాయబ్ తహసీల్దార్ లక్ష్మి కాంత్,పాన్ గల్ నాయబ్ తహాసీల్దార్ చక్రపాణి,చిన్నంబావి నాయబ్ తహాసీల్డార్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో  బూత్ స్థాయి అధికారులకు శిక్షణా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఓటర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.

1 జనవరి 2024 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరు గ్రామాల్లోని బిఎల్ఓ ల దగ్గర ఫామ్ 6 సమర్పించి ఓటర్ గా నమోదు చేసుకోవాలన్నారు. అలాగే పాత ఓటర్ కార్డులలో ఏవైనా తప్పులు ఉంటే ఫామ్ 8 ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. ఒక పోలింగ్ కేంద్రం నుండి మరొక పోలింగ్ కేంద్రానికి గాని, ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గాన్ని గాని ఓటును మార్చుకునే అవకాశం ఉన్నందున ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు అన్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొందరికి ఓటర్ గుర్తింపు కార్డు లిస్టులో పేరు లేని వారు సైతం బిఎల్ఓ ల దగ్గర గాని ఆన్లైన్లో గాని ఓటు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో  సూపర్ వైజర్ లు కురుమూర్తి, కృష్ణ, బిఎల్ఒ లు తదితరులు పాల్గొన్నారు.