అంబేద్కర్ కు ఘన నివాళి

అంబేద్కర్ కు ఘన నివాళి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: విశ్వమానవమూర్తి,  బాబా సాహెబ్ డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ 132వ  జయంతి సందర్భంగా శుక్రవారం నాడు దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ చదువు ద్వారానే ఉన్నత స్థానం పొందవచ్చు అని అంబేద్కర్ రుజువు చేశారని అన్నారు. ఎన్నో అవమానాలకు గురైన అనుకున్నది సాధించి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడైనరని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఏప్రిల్ మాసం మహానుభావుల మాసంగా వచ్చిందన్నారు.

బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేడ్కర్ల పుట్టినరోజు ఈ నెలలో రావడం విశేషం అన్నారు. భవిష్యత్తు లో వచ్చే సమస్యలను సైతం ముందుగానే గ్రహించి బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ రూపకర్త, విశ్వ విజ్ఞాన మూర్తి, సామాజిక సమతాస్ఫూర్తి,  భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని అదనపు కలెక్టర్ కొనియాడారు. వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో మనం పనిచేయాలన్నారు. హైదరాబాదులో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్. డి. ఓ. పద్మావతి,ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నుషిత, కోళ్ల వెంకటేష్, కుల సంఘాల నాయకులు,  అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.