అంబేద్కర్ జయంతి కి 132 కిలోల కేక్

అంబేద్కర్ జయంతి కి 132 కిలోల కేక్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అంబేడ్కర్  132వ జయంతి సందర్భంగా నిర్మల్ లో శుక్రవారం ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన రామాంజనేయ గణేష్ మండలి సభ్యులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 132 కిలోగ్రాముల బరువైన కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.