అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి :  అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించుకోవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వనపర్తి బస్టాండ్ లో ప్రజలకు ప్రయాణికులకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రదర్శన రూపంగా అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది ఎల్ఎఫ్ నరసింహారెడ్డి, డాప్ జైపాల్ రెడ్డి, ఎఫ్ఎం బాలకొండ తదితరులు పాల్గొన్నారు.