కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి - మాజీ మంత్రి చిన్నారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి - మాజీ మంత్రి చిన్నారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి

ముద్ర, వనపర్తి  (జులై 14): వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి,వనపర్తి నియోజకవర్గ నాయకులు పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం నంది హిల్స్ లోని మేఘారెడ్డి నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు  సమావేశంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులందరం కలిసి పని చేద్దామని, కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేద్దామని సమావేశంలో సమ ఆలోచనలు చేశారు. 

ఈనెల 20న ఏఐసీసీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో కొల్లాపూర్ లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు జన సమీకరణ అంశంపై ఇరువురు చర్చించారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొనే బహిరంగ సభకు వనపర్తి నియోజకవర్గం నుంచి 30 నుంచి 35 వేల మందిని తరలించేందుకు గ్రామ గ్రామాన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.జులై 16న వనపర్తి పట్టణంలో ఏర్పాటు చేయనున్న ముఖ్య కార్యకర్తల సమావేశ ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో  పెద్దమందడి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సత్య రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సహదేవ్ యాదవ్, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, కౌన్సిలర్ బ్రహ్మం, రాధాకృష్ణ, వెంకటేష్, సర్పంచ్ రాధాకృష్ణ, చిన్న మందడి ఉపసర్పంచ్ శ్రీనివాసులు యాదవ్, ఎండి బాబా, జైపాల్ రెడ్డి, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటన్న, నాయకులు గట్టు యాదవ్, జనగే మన్నెంకొండ యాదవ్, తిరుపతిరెడ్డి, వెంకటయ్య,రాము, తిరుపతయ్య యాదవ్,దివాకర్, అంబటి రమేష్, శివ యాదవ్, వడ్డె  శ్రీనివాసులు, వడ్డే వెంకటేష్, వెంకటయ్య, రాఘవేందర్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు