రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి చిన్నారెడ్డి

రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి చిన్నారెడ్డి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : అర్థరాత్రి దేవాలయాలను, మజీదులను కూల్చి వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వెంటరాగా కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ప్రధాన రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్లు టిఆర్ఎస్ కార్యకర్తలతో అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగారు.

రోడ్ల విస్తరణ అడ్డుకుంటున్నారని బిఆర్ ఎస్ నేతలు ఆరోపించగా, పాము రోడ్ల విస్తరణకు వ్యతిరేకం కాదని అర్ధరాత్రి అక్రమంగా దేవాలయాలను మసీదులను కూల్చివేయడానికి మాత్రమే వ్యతిరేకిస్తున్నామని వాదనకు దిగారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకొని డిఆర్ఎస్ నేతలను అక్కడి నుండి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మాజీ మంత్రి చిన్నారెడ్డికి పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీరల చందర్, నాయకులు కమ్మర్ మియా, కోట్ల రవి, బాబా, జాన్ తదితరులు పాల్గొన్నారు.