బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించిన ఎంపీడీవో

బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించిన ఎంపీడీవో

ముద్ర,వీపనగండ్ల:-బడి ఈడు పిల్లలను బడిలోనే ఉంచాలని, తల్లిదండ్రులు వారిని పనిలో పెట్టడం వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఎంపీడీవో కథలప్ప, మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గోపాల్ దీన్నే గ్రామంలో అనూష, చందు అన్న ఇద్దరు పిల్లలను వారి తల్లిదండ్రులు బడి మాన్పించి పనిలో పెట్టడం వల్ల ఆ తల్లిదండ్రులకు విద్యా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కల్పించారు.భారత రాజ్యాంగం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులు ఉచిత నిర్బంధ విద్యను అభ్యసించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంపీడీవో కథలప్ప, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ కౌన్సిలింగ్ నిర్వహించి ఇద్దరు పిల్లలను(అనూష, చందు) పాఠశాలలో చేర్పించారు. ఇట్టి కార్యక్రమంలో గోపాల్ దీన్నే గ్రామ సర్పంచ్ విజయ్, వీపనగండ్ల ఏ.ఎస్ఐ .చంద్రారెడ్డి పంచాయతీ సెక్రెటరీ విక్రమ్, ప్రధానోపాధ్యాయులు, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు బాల గౌడ్, నాగ శేషు శ్రీనివాసులు, సి ఆర్ పి వెంకటేష్ పాల్గొన్నారు.