మెదక్ లో ఆటో డ్రైవర్ల ఆందోళన

మెదక్ లో ఆటో డ్రైవర్ల ఆందోళన
  • కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహా లక్ష్మి పథకం ఉచిత బస్సు సౌకర్యం వల్ల లక్షలాదిమంది  ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తు శనివారం మెదక్ లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుండి మెదక్ కలెక్టరేట్ వరకు 500 ఆటోలతో  భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆటో డ్రైవర్ లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం. స్వల్ప ఉద్రిక్తత చోటచేసుకుంది.ఈ సందర్బంగా మెదక్ జిల్లా ఆటో యూనియన్  అధ్యక్షులు జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ..ఆర్టీసీ బస్లలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో  తమ ఉపాధి దెబ్బ తింటుందన్నారు. క్షేత్రస్థాయిలో ఆటో కార్మికుల యొక్క పరిస్థితి తెలుసుకొని తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ బ్యాంకులు అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్న  కార్మికులకు నెలనెల కిస్తులు కట్టే పరిస్థితి లేదన్నారు.ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.ఆటో కార్మికులకు ప్రతినెల 15 వేల రూపాయల జీవనభృతిని కల్పించాలని, వడ్డీ లేని రుణం అందించాలని, వాహనాలకు భీమా ఉచితంగా అందించాలని,గృహలక్ష్మి పథకం కింద 150 గజాల ఇంటి స్థలం అందించాలని. ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు.