మెదక్ లో బిజెపి నిరసన

మెదక్ లో బిజెపి నిరసన
  • రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్:భారత ఉపరాష్ట్రపతి  జగదీప్ దన్కడ్ ను అవహేళన చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు బిజెపి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.