నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి: జిల్లా ఎస్పీ రోహిని ప్రియదర్శిని

నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి: జిల్లా ఎస్పీ రోహిని ప్రియదర్శిని
Criminals should be punished District SP Rohini Priyadarshini

Medak District SP Rohini Priyadarshini ముద్ర ప్రతినిధి, మెదక్: నేరస్తులకు శిక్షలు పడుటకు కోర్ట్ డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. శనివారం ఎపిపి, పిపిలతో జిల్లా కోర్ట్ కానిస్టేబుళ్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, న్యాయ శాఖా వారి సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ శిక్షల శాతం పెంచాలన్నారు. కోర్ట్ వారెంట్స్, సమన్స్, వర్టికల్స్ గురించి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్ అధికారులు తమ విధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్.బి.డబ్లూ క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేయాలని, కన్విక్షన్ రేటును పెంచాలన్నారు.

కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద, బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిడిజే పి‌పి ఫజల్ మహమ్మద్, ఫస్ట్ ఎడిజే పిపి ప్రభుదాన్యం, సబ్ కోర్ట్ ఏపీపీ రాజ్ కుమార్, జిఎఫ్ సిఎం మొబైల్ కోర్ట్ పిపి నవీన్ కుమార్, జిఎఫ్సీయం నర్సాపూర్ కోర్ట్  ఏపీపిఓ రాఘవేంద్ర, డి.సి.ఆర్.బి సి.ఐ దిలీప్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ విట్టల్, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది  పాల్గొన్నారు.