సిపిఐ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ

సిపిఐ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ

- సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు
 ముద్ర,ఎల్లారెడ్డిపేట:  రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు  ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈనెల 22న ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్,  గంభీరావుపేట , వీర్నపల్లి , వేములవాడ మండలాలలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.అనంతరం వేములవాడ పట్టణంలో సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొనే  భారీ  బహిరంగ సభ జరుగుతుందని ఈ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు.రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అయినా 2023 ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు బిజెపికి హటావో దేశ్ కి బచావో పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రధాని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం విధానాలు దాని వలన దేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాలను దేశ సమైక్యత సమగ్రతలకు వాటిల్లే  ప్రమాదలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు.

హిట్లర్ తరహా పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించి వామపక్ష ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి  వచ్చే విధంగా ప్రజలను చైతన్య పరిచే పాదయాత్రలను ప్రజా పోరాట యాత్రలను వివిధ రూపాల్లో చేపట్టి ప్రతి గ్రామము సందర్శించాలని సిపిఐ జాతీయ సమితి పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగా సిపిఐ జాతీయ కార్యదర్శి ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో భాగంగా మండలాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని ప్రజలందరూ వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభకు  అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు పంతం రవి,  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సోమ నాగరాజు , ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఖానాపురం అరుణ్ పాల్గొన్నారు.