నేడు ‘బలగం’ సినిమా గ్రాండ్ ఫ్రీ రీలిజ్ ఈవెంట్

నేడు ‘బలగం’ సినిమా గ్రాండ్ ఫ్రీ రీలిజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా నేడు సిరిసిల్ల కు మంత్రి కేటీఆర్
  • గ్రాండ్ ఫ్రీ రీలీజ్ ఈవెంట్ లో సందడి చేయనున్న సీని నటులు
  • సిరిసిల్ల మానేరు ఒడ్డున బతుకమ్మ ఘాట్ వద్ద బారి ఏర్పాట్లు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కమీడియన్, బబర్ధస్త్ ఫేం వేణు టిల్లు మొదటి సారి దిల్ రాజు ప్రోడక్షన్ లో దర్శకత్వం వహించిన ‘బలగం’సినిమా గ్రాండ్ ఫ్రీ రీలిజ్ ఈవెంట్ ను సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద రాత్రి ఫ్లడ్ లైట్ల మధ్య.. సిని ప్రముఖులు, నటి నటులు సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు మంత్రి కేటీఆర్ హజరౌతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా లో మొదటి సారి బలగం సినిమా షూట్ చేసుకోని పూర్తి చేసుకుంది. ఈ గ్రాండ్ ఫ్రీ రీలిజ్ ఈవెంట్ కూడా దిల్ రాజు ప్రోడక్షన్ సిరిసిల్ల లోనే నిర్వహించడం విశేషం. దర్శకుడు వేణు ఎల్ధండి కూడా సిరిసిల్లకు చెందిన వ్యక్తి కావడంతో మంత్రి కేటీఆర్ ఈ వేడుకలకు ప్రత్యేకంగా హజరవుతున్నారు. పల్లె వాతవారణంలో.. బంధాలు, అనుబందాలు.. మానవతా విలువలపై.. తీసిన సినిమాను ఇప్పటికే పలు షోలు ప్రత్యేకంగా ప్రముఖులకు, మేధావులకు చూపించారు. మార్చి 3న ఈ సినిమా రీలీజ్ కానుంది. ఇప్పటికే ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ బలగం సినిమా రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ లో ఎక్కువ శాతం, మల్కపేట, జెగ్గారావుపల్లి, సర్ధాపూర్, సిరిసిల్ల, తంగళ్లపల్లి, జిల్లెల్ల గ్రామాలలో షూటింగ్ చేశారు. సిరిసిల్లకు చెందిన సూమారు 10 మంది కళాకారులకు ఈ సినిమాలో అవకాశం లభించింది. జూనియర్ ఆర్టీస్టులగా సూమారు 200 మందికి పైగా పలు గ్రామాల ప్రజలు కనిపించనున్నారు. సర్ధాపూర్, జెగ్గారావుపల్లి, చంద్రంపేట కు చెందిన డప్పు కళకారులు సైతం ఈ సినిమాలో కనిపించనున్నారు. వారి డప్పు వాయిద్యాలు ఈ సినిమాలో హైలేట్గా నిలవనున్నాయి. మంగళవారం సాయంత్ర జరిగే ఈ గ్రాండ్ ఫ్రీ రీలిజ్ ఈవెంట్కు మంత్రి కేటీఆర్, ప్రోడ్యుసర్ దిల్ రాజు, దర్శకుడు వేణు ఎల్ధండి, హీరో ప్రియదర్శి, హిరోయిన్ కావ్య, టిజే టిల్లు(సిద్దు జోన్నలగడ్డ), సుడిగాలి సుధీర్, చమక్ చంద్రా, రచ్చ రవి, శ్రీనివాస్, చిత్రం శ్రీను, మ్యూజిక్ డైరక్టర్ భీమ్స్, లిరిక్ రైటర్ శ్యాం కాసార్ల, గాయిని మంగ్లీ, రామ్ మిర్యాల, ఇతర సిని ప్రముఖులు, నటి నటులు హజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు బారి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రీ రీలిజ్ ఈవెంట్కు సిని అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటే అవకాశాలు ఉండటంతో నిర్వహకులు పార్కింగ్ స్థలాలే కేటాయింపు, విఐపి రాకపోకలకు దారి, సిని అభిమానులకు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల మానేరు ఒడ్డున గంగమ్మ గుడి పక్కనే ఉన్న బతుకమ్మ ఘాట్ లో సిని సందడి నెలకొననుంది.