ముఖ్యమంత్రిని కలిసిన తిరుమల మహేష్

ముఖ్యమంత్రిని కలిసిన తిరుమల మహేష్

ముద్ర.వనపర్తి:- రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సహకార సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు తిరుమల మహేష్ సోమవారం రాత్రి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసిన తిరుమల మహేష్ శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు ధనలక్ష్మి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.