ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం  జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం  జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అసిస్ సంఘం తెలిపారు.  సోమవారం కలెక్టరేట్ ఐ సి ఓ సి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 50 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి,  వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 ఎస్పీ ప్రజావాణికి 12 దరఖాస్తులు

 వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 12 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆమె నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సంబంధిత పోలీస్ శాఖల అధికారులకు దరఖాస్తులను పంపి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. భార్యాభర్తల ఫిర్యాదులు 2, పరస్పర దాడుల ఫిర్యాదులు 3, భూ సమస్యల ఫిర్యాదులు 7, మొత్తం 12 ఫిర్యాదులు అందినట్లు ఆమె తెలిపారు.