మార్కెట్ కమిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు

మార్కెట్ కమిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు

కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పెండ్యాల మమత-మనోహర్

కాటారం, ముద్ర న్యూస్: కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పెండ్యాల మమతా-మనోహర్ అన్నారు. సోమవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ పెండ్యాల మమతా-మనోహర్ అద్యక్ఱతన మొదటిసారిగా సమావేశం నిర్వహించి ఈమేరకు తీర్మాణించారు.1993 లో కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు కాగా 2012 లో కాటారం శివారులో ప్రభుత్వం 12-09 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గిడ్డంగి, కార్యాలయం, షెడ్,వేబ్రిడ్జ్ నిర్మించింది.దాంతోపాటు శంకరాంపల్లి గ్రామంలో 5 ఎకరాలు, మహాదేవ్ పూర్ మండలకేంద్రంలో 3 ఎకరాల భూములను ప్రభుత్వం కెటాయించింది.

ఈ రెండు చోట్ల కూడా గిడ్డంగులను నిర్మించారు.ఐతే గత కొంత కాలంగా మార్కెట్ కమిటీ భూములపై కన్నేసిన కొందరు వ్యక్తులు కబ్జాలకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మార్కెట్ కమిటీ భూములు కబ్జాలకు గురౌతున్నాయని,భూములను పరిరక్ఱించాలని పలువురు పేర్కొన్నారు. ఈక్రమంలో సమావేశమైన పాలకవర్గం భూములను రక్ఱించేందుకు రెవెన్యూశాఖ ద్వారా సర్వే జరిపి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు చైర్ పర్సన్ మమతా-మనోహర్ అద్వర్యంలో కాటారం తాహాసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అలాగే మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రధాన రహదారి నుంచి కార్యాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈసమావేశంలో ఇంచార్జ్ డీఎంఓ కనకశేఖర్,వైస్ చైర్మెన్ రాదారపు స్వామి,సబ్యులు మందల లక్ఱ్మారెడ్డి,సమ్మయ్య,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.