ఎమ్మెల్యే పోచారం నకు అభినందనల వెల్లువ

ఎమ్మెల్యే పోచారం నకు అభినందనల వెల్లువ

బాన్సువాడ, ముద్ర: శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధించిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి  బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం నాడు శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని  బిఆరెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో, నివాసంలో పోచారంని కలిసిన బాన్సువాడ పట్టణ మరియు మండలాల‌, గ్రామాల, తాండాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోచారం గారిని శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం గారు చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన సేవలు ఆయన ఘనవిజయానికి ప్రతీక అని కొనియాడారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికి పోచారం ధన్యవాదాలు తెలిపారు.