తోడుకున్నోళ్లకు తోడుకున్నంత ఇసుక

  •  అనుమతులు లేవు చర్యలు అసలే లేవు
  •  మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ ఇసుక దందా

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పరిధిలోని తూముకుంట వాగు నుండి యదేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జెసిబి సహాయంతో డాక్టర్లతో తరలిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసిన వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తూముకుంట వాగు నుండి కొందరు ఇసుకను అక్రమంగా నిలువ చేస్తూ జెసిబి ల సహాయంతో తోడేస్తున్నారు.

వాగు దగ్గర ఇసుకను కుప్పలు కుప్పలుగా డంప్ చేస్తూ వేల రూపాయలు ఇసుక అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లుగా  వ్యవహరించడం, అక్రమార్కులు అదే అదనుగా చూసుకొని  తన వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏదేక్షగా కొనసాగిస్తున్నారు. తూముకుంట గ్రామానికి చెందిన 20 ట్రాక్టర్లు రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక ట్రాక్టర్ ఇసుక 4000 పైచిలుక చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా పేదవాళ్లు ఇల్లు నిర్మాణానికి డాక్టర్ ఇసుక కావాలంటే ఒక్కోసారి 4 వేలకు పైగా పలుకుతుంది. అప్పనంగా తీసుకొస్తూ గృహ వినియోగదారులకు వేలకు వేలు విక్రయిస్తున్నాడంతో  తీవ్రంగా నష్టపోతున్నారు. దీనివల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్న రీతిలో ఇక్కడి నుంచి ఇసుకను తరలిస్తున్నారు.

అధికారులు కూడా తెలిసిన పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి యజమానులపై జరిమానా విధించగా ఎంతో కొంత జరిమానా కట్టి తమ పని తిరిగి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇసుక అక్రమ రవాణా నిరంతరం కొనసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.