సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలి

సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలి
  • జనరల్ బాడి మీటింగ్ పెట్టలేదు.
  • సభ్యులకు ఆదాయ, వ్యయాలు చూపకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న క్లబ్ సెక్రటరీ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నందు జరుగుతున్న అవినీతి, అవకతవకలపై సూర్యాపేట ఆర్డివో విచారణ జరపాలని పబ్లిక్ క్లబ్ సభ్యులు, అడ్వకేట్ నూకల  సుదర్శన్ రెడ్డి, మాజి కార్యదర్శి బొల్లెద్దు దశరధ అన్నారు. మంగళవారం  క్లబ్ ఆవరణలో జరిగిన సభ్యుల  సమావేశంలో వారు మాట్లాడుతూ   పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా కొప్పుల వేణారెడ్డి పనిచేసిన సమయంలో  దుకాణ సముదాయం నిర్మాణం చేయడం వలన, జిమ్ సెంటర్ ఏర్పటు చేయడం ద్వారా ఆదాయం పెరిగిందని, ప్రస్తుతం క్లబ్ ఆదాయం లక్షలలో వున్నదని అన్నారు.

ప్రస్తుత   సెక్రటరీ  క్లబ్  ఆదాయ వ్యయాలను కమిటీ సభ్యులకు తెలియజేయడం లేదని, సెక్రటరీ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో లక్షలాది రూపాయల అవినీతి కి పాల్పడినారని వారు ఆరోపించారు. 12 నెలలకు ఒకసారి జనరల్ బాడి మీటింగ్ పెట్టవలసి వున్నప్పటికీ, సమావేశం నిర్వహించడం లేదని అన్నారు. పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ కాంట్రాక్టర్ రెండు సంవత్సరాల  పాటు చెల్లుంచవలసిన అద్దె చెల్లించలేదని, అద్దె వసూలు చేస్తామని కార్యదర్శి చెప్పినప్పటికీ వసూలు చేయలేదని అన్నారు.  క్లబ్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై క్లబ్ చైర్మన్ అయిన సూర్యాపేట ఆర్డివొ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు ఎల్గూరి చంటి బాబు, గుడిపాటి శేషయ్య, శనగాని రాజబాబు, రావుల రాంబాబు నాయుడు, కుమ్మరికుంట్ల లింగయ్య, కుందమల్ల శేఖర్, ఎల్గూరి రవి, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాపర్తి నాగరాజు గౌడ్, నంద్యాల సురేష్ రెడ్డి, సాయినేత, నాగుల వాసు, సైదులు మేస్త్రీ తదితరులు పాల్గొన్నారు.