రామగుండం మేయర్ కు అవిశ్వాస గండం...?

రామగుండం మేయర్ కు అవిశ్వాస గండం...?
  • బల్దియ కార్యాలయంలో సమావేశమైన 25 బీఆర్ఎస్ కార్పొరేటర్లు..
  • అవిశ్వాస అంశమే ముఖ్య ఉద్దేశం..

ముద్ర పెద్దపల్లి జిల్లా ప్రతినిధి:రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు లకు పదవి గండం పట్టుకుంది. గత కొంతకాలంగా  మేయర్ పై అవిశ్వాసంకు సానుకూలంగా ఉన్న కార్పొరేటర్లు ఓపిక నశించి మంగళవారం నాడు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మేయర్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి  మేయర్ పైన అవిశ్వాస పత్రం అందజేయనున్నట్లు సమావేశంలో పాల్గొన్న ఒక కార్పొరేటర్ తెలిపారు. నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కూడా మేయర్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ లని ఆహ్వానించకుండా అవమానించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రామగుండం మేయర్ పై అవిశ్వాసం పెడతారా? లేదా అని రాజకీయ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.