అక్రమ లే అవుట్ లను పరిశీలించాలి - జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక

అక్రమ లే అవుట్ లను పరిశీలించాలి - జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక

హుజూర్ నగర్ ముద్ర:సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని అక్రమ లే అవుట్ లను పరిశీలించాలని అదనపు కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సంస్థల మున్సిపల్ కమిషనర్లు ,తాసిల్దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ అక్రమ లే ఔట్ ల పరిశీలన కోసం తాసిల్దారు మరియు సర్వేయర్లతో టీం లను ఏర్పరిచి ఆర్డిఓ పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం అక్రమ లేఔట్ లను పరిశీలించిన ఆమె కమ్యూనిటీ కోసం కేటాయించిన 10 శాతం స్థలంలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హుజూర్ నగర్ నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్లు, హుజూర్ నగర్ గరిడేపల్లి తాసిల్దారులు, మట్టంపల్లి డిటి, టీ.పి.బి.ఓ, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.