బాధితులకు బరోసా కల్పించాలి.

బాధితులకు బరోసా కల్పించాలి.
  • పిర్యాదులపై వేగంగా స్పందించాలి.
  •  ప్రతి పిర్యాదుకు రశీదు ఇవ్వాలి.
  •  పిర్యాదుల నిర్వహణ పై జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఫీడ్ బ్యాక్ సేకరణ.
  • రాహుల్ హెగ్డే,ఎస్పి సూర్యాపేట జిల్లా 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు, ఫిర్యాదుదారులకు భరోసా, నమ్మకాన్ని కల్పించడం పోలీసు ప్రాథమిక విధి అని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్  అన్నారు. పోలీస్ రిసెప్షన్ సెంటర్స్, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం నిర్వహణపై సెట్ కాన్ఫిరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు సిబ్బందికి ఎస్పీ  పలు సూచనలు సలహాలను మంగళవారం అందించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల, పిర్యాదుదారుల పట్ల గౌరవంగా ఉండాలని, పోలీసు శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలని తెలిపినారు.  సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దు అని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని రిసెప్షన్ సెంటర్ల నందు మౌలిక వసతులను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి ప్రాథమిక విచారణను వేగంగా నిర్వహించాలని తద్వారా బాధితులకు ఫిర్యాదుదారులకు భరోసా నమ్మకాన్ని కల్పించాలని, ప్రతి ఫిర్యాదు అంతర్జాలంలో నమోదు చేయాలి, ప్రతి  ఫిర్యాదులు రసీదు ఇచ్చి పోలీసు పనితీరు పట్ల పారదర్శకతను చూపాలని తెలిపారు.  పిటిషన్ మేనేజ్మెంట్ నిర్వహణ రిసెప్షన్ సెంటర్ నిర్వహణ కు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నాం అని అన్నారు.

 ప్రతి సోమవారం పోలీస్ ప్రజావాణి

బాధితుల  సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం చూపడానికి గాను ప్రతి సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్  తెలిపారు.  జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఫిర్యాదుల నిర్వహణ కొరకు సెంట్రల్ కంప్లైంట్ సెల్ సమర్ధవంతంగా పనిచేస్తుందని, గత వారం రోజులుగా సెంట్రల్ కంప్లైంట్ సెల్ ద్వారా జిల్లా పోలీస్ కార్యాలయం నందు 28 ఫిర్యాదులు పరిశీలించడం జరిగిందని అన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడి భౌతిక దాడులు చేసుకోవద్దు. ప్రజలు సివిల్ తగాదాలు, భూమి సంభందిత సమస్యలను చట్ట ప్రకారం కోర్టుల పర్యవేక్షణలో పరిష్కరించుకోవాలని కోరినారు.